ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం అందించడం సాక్షాత్తూ భగవంతునికి నైవేద్యం సమర్పించినంత పవిత్రమైన సేవ అని మా విశ్వాసం.
భక్తిశ్రద్ధలతో చేసే పూజలు మనకు దైవానుగ్రహాన్ని ప్రసాదిస్తాయి. ఆ పుణ్యఫలానికి అన్నదానం తోడైతే, ఆ సేవ మరింత విశేషమైన ఫలాన్ని అందిస్తుందని మా నమ్మకం. ఆకలితో ఉన్నవారికి కడుపునిండా భోజనం అందించి, వారి ముఖంలో సంతృప్తిని చూడటం, వారి మనస్ఫూర్తి ఆశీర్వాదాలను పొందడం ఒక అపూర్వమైన అనుభూతి.
అన్నం కోసం ఎదురుచూసే ప్రతి ఒక్కరికీ గౌరవంగా భోజనం అందించాలన్నదే మా ఆశయం.
ప్రతిరోజూ వీలైనంతమందికి నిత్యాన్నదానం అందించగల స్థాయికి ఎదగడమే శ్రీ రక్ష దీర్ఘకాల సంకల్పం.